దీపిక చిత్రం తిరిగి సెట్స్‌పైకి - deepika padukone movie back to sets
close
Published : 27/08/2020 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక చిత్రం తిరిగి సెట్స్‌పైకి

ముంబయి: ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’తో భారీ విజయం అందుకున్న షకున్‌ బత్రా దర్శకత్వంలో ఓ చిత్రం ఈ ఏడాది మార్చిలో మొదలైంది. ఇందులో దీపికా పదుకొణె, అనన్యాపాండే, సిద్ధాంత్‌ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలైన కొన్ని రోజులకే కొవిడ్‌ ప్రభావంతో సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగి పోయింది.

తాజాగా కేంద్రం చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వడంతో తమ సినిమాను వచ్చే నెల్లో తిరిగి సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది చిత్రబృందం. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని    శ్రీలంకలో తెరకెక్కించాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లి షూటింగ్‌ చేయడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల్లోనే గోవాలో 25 రోజుల పాటు షూటింగ్‌ చేయనున్నారని సమాచారం.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని