థియేటర్‌లో దిల్‌రాజు సందడి - dilraju celebrations in theaters
close
Published : 09/04/2021 09:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థియేటర్‌లో దిల్‌రాజు సందడి

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని శివపార్వతి థియేటర్‌లో నిర్మాత దిల్‌రాజు ‘వకీల్‌సాబ్‌’‌ షో వీక్షించారు. పవన్‌ ఎంట్రీ సీన్‌కు అభిమానులతో కలిసి ఆయన కాగితాలు విసిరి.. సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పవన్‌ అభిమానులు భారీగా సంబరాలు జరుపుకొంటున్నారు. పవన్‌ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చి.. డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సినిమా సూపర్‌గా ఉందని, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయిందని నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పింక్‌’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ రూపుదిద్దుకుంది. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈచిత్రాన్ని నిర్మించారు. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.








మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని