‘గాలి సంపత్‌’ రెడీ అయ్యాడిలా! - gaali sampath making vedio
close
Published : 24/03/2021 22:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గాలి సంపత్‌’ రెడీ అయ్యాడిలా!

హైదరాబాద్‌: నట కిరీటి రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన మిత్రుడు సాయికృష్ణ కథను అందించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీష్‌కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మూగవ్యక్తిగా నటిస్తూ కేవలం ‘ఫీఫీ’అనే సౌండ్‌తోనే సంజ్ఞలు చేస్తుంటాడు. నటనంటే అమిత ఆసక్తి. దురదృష్టవశాత్తు ఇంటి వెనకున్న బావిలో పడిపోతే, తండ్రి కనిపించక కొడుకు గాబారా పడుతుంటాడు. తండ్రీకొడుకుల మధ్య అప్యాయతలను ఈ చిత్రం చూపిస్తుంది. కొడుకుగా శ్రీవిష్ణు, అనువాదకుడిగా కమెడియన్‌ సత్య తమదైన శైలి నటించి మెప్పించారు. లవ్‌లీసింగ్‌ కథానాయికగా అలరించింది. మరి ఆ గాలిసంపత్‌ ఎలా బావిలో పడ్డాడు, ఆ అందమైన అరకులో ఎలా షూట్‌ చేశారో చూడాలనుందా? అయితే ఈ మేకింగ్‌ వీడియో చూసేయండి. ప్ర్తస్తుతం ఈ చిత్రం ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికల్లో ప్రదర్శితమౌతోంది
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని