అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం పోతోంది
close
Published : 26/04/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం పోతోంది

న్యూయార్క్‌: అమెరికాలో నిరుద్యోగం క్రమంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ప్రతి ఆరుగురిలో ఒకరు తమ ఉపాధిని కోల్పోతున్నారు. 1930 మహా మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నట్లు తాజాగా విడుదలైన ఉద్యోగ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1931-40 మధ్య కాలంలో నిరుద్యోగ రేటు 14 శాతానికి పైగా ఉండేది. గరిష్ఠంగా 25 శాతం కూడా నమోదైనట్లు లెక్కలున్నాయి. 2008-09 ఆర్థిక మాంద్యం సమయంలోనూ ఈ రేటు 10 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొవిడ్‌-19 సంక్షోభంలో ఉద్యోగాలు ఇలాగే కోల్పోతుంటే, వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు కచ్చితంగా 10% పైనే నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, గత వారంలో ఏకంగా 44 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని