లాక్‌డౌన్‌ వేళ ట్విటర్‌ కీలక నిర్ణయం!
close
Published : 13/05/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ ట్విటర్‌ కీలక నిర్ణయం!

న్యూయార్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విటర్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సంచలన విషయం ప్రకటించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు (వర్క్‌ ఫ్రం హోం) అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షల నేపథ్యంలో తమ ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రం హోం’ చేసేందుకు మార్చిలో తొలిసారి అనుమతించింది. అప్పటి నుంచి చాలా మంది ఇంటి నుంచే వారి సేవల్ని అందిస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండడంతో భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఉద్యోగులకు కల్పిస్తామని తెలిపారు. అయితే, తప్పనిసరి కార్యాలయాలకు రావాల్సిన వారికి మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరు వరకు తమ కార్యాలయాల్ని తెరిచేది లేదని ట్విటర్‌ ప్రకటించింది. దాదాపు ఈ సంవత్సరాంతం వరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విటర్‌ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో మారనున్న పనితీరుకు ట్విటర్‌ తాజా నిర్ణయం ఓ నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని