జీవన కాల గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు
close
Published : 30/05/2020 02:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవన కాల గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు

49,004.4 కోట్ల డాలర్లకు చేరిక

ముంబయి: విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు మే 22తో ముగిసిన వారానికి 300.5 కోట్ల డాలర్ల మేర పెరిగి 49,004.4 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఇది జీవన కాల గరిష్ఠ స్థాయి. ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) పెరగడమే ఇందుకు కారణం. అంత క్రితం వారం కూడా ఫారెక్స్‌ నిల్వలు 172.6 కోట్ల డాలర్లు పెరిగి, 48,704 కోట్ల డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. సమీక్షా వారంలో, ఎఫ్‌సీఏలు 303.5 కోట్ల డాలర్ల మేర పెరిగి, 45,170.6 కోట్ల డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు మాత్రం 12.7 కోట్ల డాలర్ల మేర తగ్గి, 3,277.9 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 80 లక్షల డాలర్ల మేర పెరిగి, 143.2 కోట్ల డాలర్లకు చేరగా, నిల్వల స్థితి కూడా 8.9 కోట్ల డాలర్ల మేర పెరిగి, 412.7 కోట్ల డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ తెలిపింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని