close

తాజా వార్తలు

రితూవర్మ ప్రయత్నాలు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విశాల్‌ నటించిన ‘యాక్షన్‌’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు విశాల్‌. మిష్కిన్‌ దర్శకత్వంలో ‘తుప్పరివాళన్‌ 2’ చిత్రంలో నటిస్తున్నారు. లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. దీని తర్వాత ఆనంద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘చక్ర’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా ప్రారంభ దశ పనులు జరుగుతున్నాయి. వీటి తర్వాత ‘అరిమానంబి’, ‘ఇరుముగన్‌’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలోని చిత్రంలో నటించనున్నారు విశాల్‌. రితూవర్మ కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె విక్రం హీరోగా నటించిన ‘ధ్రువనక్షత్రం’లో నటించారు. రెండు, మూడేళ్లు దాటుతున్నప్పటికీ ఆ సినిమా ఇంకా తెరపైకి రాలేదు. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న ‘కన్నుం కన్నుం కొళ్లైయడిత్తాల్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇక విశాల్‌తో కథానాయికగా నటించనుండటం ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.