మోదీకి ఆ భేదాభిప్రాయాలు లేవు:మోహన్‌బాబు
close
Published : 07/01/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీకి ఆ భేదాభిప్రాయాలు లేవు:మోహన్‌బాబు

దిల్లీ: తిరుపతిలో తమ విద్యాసంస్థలను సందర్శించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు తెలిపారు. ఈ మధ్యాహ్నం ప్రధానితో సమావేశమైన ఆయన కుటుంబసభ్యులు.. తాజాగా కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. భాజపాలోకి మోదీ ఆహ్వానించారా? అని మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా.. ఆ విషయం చెప్పలేనంటూ మోహన్‌బాబు సమాధానం దాటవేశారు. కేవలం బాలీవుడ్‌ నటులతోనే మోదీ భేటీపై అడగ్గా.. ఆయన మాటల్లో ఆ భేదాభిప్రాయం లేనేలేదన్నారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘నాన్న మాట్లాడిన తర్వాత చిన్న రిక్వెస్ట్‌ చేయొచ్చా అని మోదీ గారిని అడిగాను. ఏంటి అని ఆయన అడిగారు. బాలీవుడ్‌ నటులను కలిశారు.. దక్షిణాది నుంచి ఎవర్నీ కలవలేదు. ఈ విషయంలో కొంతమంది అలిగారు.. మరికొంతమంది బాధపడ్డారు అని చెప్పా. నాకు అవకాశం వచ్చింది కాబట్టే వారితో కలిశాను అని మోదీ చెప్పారు. త్వరలో దక్షిణాది నటులతోనూ కలుస్తాను అన్నారు. ఆయనకు ఉత్తరాది, దక్షిణాది భేధాలేమీ లేవు. ఇప్పుడు మాటల సందర్భంలో మేం రిక్వెస్ట్‌ చేశాం.. కాబట్టి త్వరలో అందరం కలుస్తాం’’ అని చెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని