చరణ్‌ మేనకోడళ్లు ఏం చేశారో చూడండి
close
Published : 16/06/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరణ్‌ మేనకోడళ్లు ఏం చేశారో చూడండి

‘బాధ్యతగల చిన్నారులు’

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఇటువంటి తరుణంలో కూరగాయల్ని శుభ్రం చేసి ఉపయోగించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు కథానాయకుడు రామ్‌ చరణ్‌. ఆయన సోమవారం తన ఇద్దరు మేనకోడళ్లతో కూడిన వీడియోను షేర్‌ చేశారు. అందులో కూరగాయల్ని నేలపై ఆరబెట్టిన దృశ్యం కనిపించింది. తన ఇద్దరు మేనకోడళ్లు ఈ పని చేశారని.. ఎంతో బాధ్యత ఉన్న పిల్లలని చెర్రీ అన్నారు. అంతేకాదు ఎందుకు ఇలా నేలపై వేశారో వివరించమని అడగగా.. చిన్నారి సమారా మాట్లాడింది. క్రిములు పోయేలా.. కూరగాయలు, ఆకుకూరల్ని ముందు సబ్బు నీటితో కడిగి, ఆ తర్వాత సాధారణ నీటితో కడిగామని, ఆరేందుకు ఇలా కింద పరిచామని చెప్పింది. ఇదే వీడియోలో చెర్రీ తన మరో మేనకోడల్ని ఆటపట్టిస్తూ కనిపించారు.

రామ్‌ చరణ్‌ ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని