close
Published : 24/02/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అక్షర’తో పిల్లలపై ఒత్తిడి తగ్గాలి

ఎమ్మెల్సీ కవిత

‘‘దేశ వ్యాప్తంగా రోజుకి నలుగురైదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది తెలిశాక మనపై మరెంతో బాధ్యత ఉందనిపించింది. సిలబస్‌, ఒత్తిడి తగ్గించడం... విద్యలో కళల్ని, సాంస్కృతిక కార్యక్రమాల్ని మేళవించడం వంటి పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సినిమా బలమైన మాధ్యమం, దీని ద్వారా చెప్పే సందేశం మనందరి హృదయాలకి హత్తుకునేలా ఉంటుందని నమ్ముతున్నా’’నన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత. ఆమె మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘అక్షర’ చిత్రం విడుదలకి ముందస్తు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. అహితేజ బెల్లంకొండ, అల్లూరి సురేష్‌వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరో అతిథిగా హాజరైన కథానాయకుడు సాయితేజ్‌తో కలిసి బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడుతూ ‘‘చదువుల్లో ఒత్తిడిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాని రూపొందించామని ‘అక్షర’ బృందం చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, నాయకుల్లో ఈ సినిమా స్ఫూర్తి నింపాలని, పిల్లలపై ఒత్తిడి తగ్గాలని  కోరుకుంటున్నా’’అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని