close
Published : 13/04/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆట మొదలైంది

‘ఖిలాడి’ ఆట మొదలు పెట్టాడు. తెలివి తక్కువ భావోద్వేగాల్ని పక్కనపెట్టి స్మార్ట్‌గా ఆడావంటే..నీకు ఎదురంటూ ఉండదంటున్నాడు. మరి ఆ ఆటలో ఎవరు ఎలాంటి ఎత్తులు, పైఎత్తులు  వేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవితేజ ద్విపాత్రా భినయం చేస్తున్న చిత్రమే ‘ఖిలాడి’. ప్లే స్మార్ట్‌... అనేది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి నాయికలు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. జయంతీలాల్‌ గడ సమర్పకులు. సోమవారం టీజర్‌ని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగిన టీజర్‌లో థ్రిల్లింగ్‌ అంశాలు ఆసక్తిని రేకెత్తించాయి. అత్యున్నత సాంకేతిక హంగులతో.. గాఢతతో కూడిన యాక్షన్‌ అంశాలకి పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఠాకూర్‌ అనూప్‌సింగ్‌, మురళీశర్మ, అనసూయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జి.కె.విష్ణు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని