మహేష్‌ కోసం ఇద్దరు భామలు?
close
Published : 19/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌ కోసం ఇద్దరు భామలు?

హేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఈ ఇద్దరి నుంచి రానున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడిందులో మహేష్‌కు జోడీగా కనిపించే నాయిక కోసం చిత్ర బృందం వేట ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో మహేష్‌ సరసన ఇద్దరు భామలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ఓ నాయికగా పూజా హెగ్డే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరో కథానాయికనీ ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని