తమన్నా...అందాల ‘గని’
close
Published : 26/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా...అందాల ‘గని’

సినిమాకి ప్రత్యేక అందం తీసుకురావడంలో పెట్టింది పేరు... తమన్నా. తెలుగులో ప్రత్యేక గీతాల స్థాయిని పెంచిన తారల్లో ఆమె ఒకరు. ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రత్యేక గీతం చేసి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. డ్యాన్స్‌పై అమితంగా ఆసక్తి ప్రదర్శించే తమన్నా... ‘మంచి సినిమాలో ఆ అవకాశం వచ్చిందంటే అస్సలు కాదన’ని చెబుతుంటుంది. తాజాగా ‘గని’లోనూ ఆమె ఓ ప్రత్యేక గీతంతో సందడి చేసేందుకు పచ్చజెండా ఊపింది. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌తో కలిసి ఆడిపాడనుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌, సయీ మంజ్రేకర్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హాలీవుడ్‌ నిపుణుల నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని