‘లూసీఫర్‌’ రీమేక్‌కి ముహూర్తం ఖరారు
close
Published : 26/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లూసీఫర్‌’ రీమేక్‌కి ముహూర్తం ఖరారు

‘లూసీఫర్‌’ రీమేక్‌ను పట్టాలెక్కించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో ఓ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇది చిరుకి 153వ సినిమా. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే నెల ఆగస్టు 12 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ఇందుకోసమే ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా తుది దశ చిత్రీకరణలో ఉంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని