Cinema News: ‘గ్రే’.. విభిన్నమైన స్పై థ్రిల్లర్‌ - telugu news Grey Movie Pooja Ceremony Held At Hyderabad
close
Updated : 18/10/2021 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘గ్రే’.. విభిన్నమైన స్పై థ్రిల్లర్‌

ప్రతాప్‌ పోతన్‌, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గ్రే’. ద స్పై హూ లవ్డ్‌ మి.. అన్నది ఉపశీర్షిక. రాజ్‌ మదిరాజు తెరకెక్కిస్తున్నారు. కిరణ్‌ కల్లాకురి నిర్మాత. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి  దర్శకుడు వీఎన్‌.ఆదిత్య క్లాప్‌ నివ్వగా.. ప్రసాద్‌ గ్రూప్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రచయిత లక్ష్మీ భూపాల్‌ స్క్రిప్ట్‌ అందించారు. నిర్మాత వివేక్‌ కూచిబొట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘గ్రే అనేది ఒక నెగటివ్‌ షేడ్‌ కాదు. ఓ బంధం. ఇదొక స్పై థ్రిల్లర్‌. ఈనెల 22నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంద’’న్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని