సంక్రాంతి సినిమాలు.. రిలీజ్‌ డేట్స్‌ మారతాయా?
close
Published : 03/01/2020 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్రాంతి సినిమాలు.. రిలీజ్‌ డేట్స్‌ మారతాయా?

సెన్సార్‌ వచ్చేసింది.. కానీ.. డేట్స్ మిస్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విడుదల కావాల్సిన వీరిద్దరి సినిమాల విడుదల తేదీల్లో మార్పులు ఉంటాయా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలు. మరోవైపు మహేశ్‌బాబు - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. దిల్‌రాజు, అనిల్‌సుంకర, మహేశ్‌బాబు నిర్మాతలు. రష్మిక కథానాయిక. మొదట ఈ రెండు చిత్రాలను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ, తెలుగు చిత్ర నిర్మాతల సంఘం సూచన మేరకు రెండు చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చేశారు. దీంతో ‘అల..వైకుంఠపురములో’ జనవరి 12న విడుదలకు సిద్ధం కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న విడుదల కానున్నట్లు ప్రకటించారు. 

అయితే తాజాగా.. ఈ సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, వీడియోలను విడుదల చేసిన ఆయా చిత్రబృందాలు వాటిపై విడుదల తేదీని ఇవ్వడం లేదు. మరోవైపు గురువారం సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘సరిలేరునీకెవ్వరు’ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా పోస్టర్‌పై రిలీజ్‌ డేట్‌ ఇవ్వలేదు. తాజాగా ‘అల..వైకుంఠపురములో’ కూడా సెన్సార్‌ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ గీతా ఆర్ట్స్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. వీళ్లు కూడా రిలీజ్‌ డేట్‌ ఇవ్వలేదు. దీంతో సినిమా విడుదల తేదీల్లో మార్పులుంటాయేమో అని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇరు చిత్ర బృందాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని