బ్లాక్‌బస్టర్‌ సినిమాకి సీక్వెల్ రానుందా?
close
Published : 07/02/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్‌బస్టర్‌ సినిమాకి సీక్వెల్ రానుందా?

టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను సైతం కొల్లగొట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. యూఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి బన్నీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. 

‘అల.. వైకుంఠపురములో’ చిత్రీకరణలో ఉండగానే త్రివిక్రమ్‌తో కలిసి మరో సినిమా చేయాలని అల్లు అర్జున్‌ అనుకున్నారట. ఇప్పుడు, ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో దీనికే కొనసాగింపుగా మరో సినిమా తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై టాలీవుడ్‌లో రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. బన్నీ అభిమానులకు పండుగనే చెప్పాలి. మరి సీక్వెల్‌ గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని