రవితేజ కొత్త సినిమా పేరు అదేనా?
close
Published : 25/02/2020 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ కొత్త సినిమా పేరు అదేనా?

హైదరాబాద్‌: రవితేజ కథానాయకుడిగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్నారు రమేష్‌ వర్మ. ఆయన చెప్పిన కథకి రవితేజ పచ్చజెండా ఊపేశారు. ఈ వేసవిలోనే  చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాకి ‘కిలాడీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రవితేజ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నారని తెలిసింది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తారు.

రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని