‘కేజీఎఫ్‌ 2’ విడుదలయ్యేది అప్పుడేనా?
close
Updated : 13/03/2020 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేజీఎఫ్‌ 2’ విడుదలయ్యేది అప్పుడేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ సినిమాగా మొదలై పాన్‌ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కేజీఎఫ్-చాప్టర్‌1’‌. ఈ ఒక్క చిత్రంతోనే కథానాయకుడు యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌లకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాల్సి ఉంది. అయితే, చిత్రీకరణ విషయంలో రాజీ పడకుండా సన్నివేశాలను తెరకెక్కించడం, ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల ఆలస్యమవుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘కేజీఎఫ్‌2’లో సమాధానం లభించనుంది. 

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడు అధీర పాత్రలో కనిపించనున్నారు. ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది. 
=


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని