క్రేజీ కాంబినేషన్‌ సిద్ధమైందా?
close
Updated : 13/06/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రేజీ కాంబినేషన్‌ సిద్ధమైందా?

హైదరాబాద్‌: వెండితెరపై సరికొత్త కలయికకు రంగం సిద్ధమవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడిది కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే కొరటాల తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నారు. కొరటాల శివ.. చిరంజీవితో ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీళ్లిద్దరి కలయికలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని