అసలు వైకుంఠపురము ఇల్లు ఇదే..!
close
Updated : 16/01/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసలు వైకుంఠపురము ఇల్లు ఇదే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ‘అల వైకుంఠపురములో’ కనిపించే ఇంటి గుట్టు బయటపడింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటిలో ఓ విలాసవంతమైన ఇంటి సెట్ వేయించిన త్రివిక్రమ్... అల వైకుంఠపురానికి మాత్రం రియల్ ఇంట్లోనే షూట్ చేశారు.

ఓ న్యూస్‌ ఛానల్‌ అధినేత కుమార్తె ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్... తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించారు. వెంటనే ఆ ఇంటి యజమానులతో మాట్లాడగానే, వాళ్లు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీలకంగా నిలిచింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు. అయితే ఆ ఇంటిని చూసిన బన్నీకి కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్‌లో ఇంటిని నిర్మించుకోబోతున్నాడు అల్లు అర్జున్. తన కొత్తింటి విషయాన్ని ఇటీవల అల వైకుంఠపురము థ్యాంక్స్ మీట్‌లో వెల్లడించిన బన్నీ... ఆ ఇంటి నిర్మాణానికి నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్‌ను డబ్బులు అడుగుతానని చెప్పడం విశేషం. అయితే బన్నీ కట్టుకోబోయే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఆ ఇంటికి ఏం పేరు పెడతాడో చూడాలి.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని