జ్వాలారెడ్డిగా తమన్నాని చూశారా..!
close
Updated : 08/02/2020 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జ్వాలారెడ్డిగా తమన్నాని చూశారా..!

హైదరాబాద్‌: మిల్కీబ్యూటీ తమన్నా జ్వాలారెడ్డిగా అలరించనున్నారు. టాలీవుడ్‌ నటుడు గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న చిత్రబృందం శనివారం తాజాగా తమన్నా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో తమన్నా పాత్రను పరిచయం చేస్తూ నెటిజన్లతో ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసిన చిత్రబృందం.. ‘ఒక ఫైర్‌.. కబడ్డీ కోచ్‌ అయితే ఇలా ఉంటుంది’ అని పేర్కొంది.

గతేడాది విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో లక్ష్మిగా అలరించి.. ప్రేక్షకులను మెప్పించారు నటి తమన్నా. ఈ సినిమాలో తమన్నా నటనను సినీ ప్రముఖులు, సినీ ప్రియులు ప్రశంసించారు. అంతేకాకుండా ఈ ఏడాది మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని