1978 పలాసలో ఏం జరిగింది?
close
Updated : 01/03/2020 21:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1978 పలాసలో ఏం జరిగింది?

హైదరాబాద్‌: ‘బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే’ అంటున్నారు యువ కథానాయకుడు రక్షిత్‌. కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పలాస 1978’. నక్షత్ర, రఘుకుంచె తదితరులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నటుడు రానా ట్రైలర్‌ను రానా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సుధాస్‌ మీడియా పతాకంపై దయన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పలాస 1978’ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని