పవర్‌స్టార్‌ ప్రీలుక్‌.. ట్రెండింగ్‌లో ట్యాగ్‌
close
Published : 01/03/2020 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవర్‌స్టార్‌ ప్రీలుక్‌.. ట్రెండింగ్‌లో ట్యాగ్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 26వ సినిమా ప్రీలుక్‌ విడుదలైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ఈ ప్రచార చిత్రం ద్వారా వెల్లడించారు. అంతేకాదు పవన్‌ నడుస్తున్న ఫొటోను కూడా జోడించారు. ఈ ప్రకటనతో అభిమానులు తెగ సంబరపడ్డారు. PSPK26 అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకున్న పవన్‌ సినిమా లుక్‌ కోసం ఫ్యాన్స్‌ ఉత్సుకతగా ఎదురుచూస్తున్నట్లు సోషల్‌మీడియా కామెంట్లను బట్టి తెలుస్తోంది.

పవన్‌ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా పవన్‌ సినిమా రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని