వెండితెరపై మరో కొత్త జోడీ
close
Published : 05/05/2020 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెండితెరపై మరో కొత్త జోడీ

హైదరాబాద్‌: వెండితెరపై మరో కొత్త జోడీ సందడి చేయనుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. ఇద్దరు కథా నాయకులతో ఆయన ‘మహా సముద్రం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కలిసి నటించబోతున్నారట. 

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో కథానాయికగా అదిరావు హైదరీని తీసుకున్నారు. శర్వా సరసన నాయికగా ఆమె నటించనుంది. ఇందులో ఒకే నాయికకి చోటుంటుందని సమాచారం. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని