‘సరిలేరు నీకెవ్వరు’ఆఫర్‌ రాలేదు! 
close
Updated : 11/01/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరు నీకెవ్వరు’ఆఫర్‌ రాలేదు! 

గ్లిజరిన్‌ వాడను: మెహరీన్‌

హైదరాబాద్‌: కథకు కనెక్ట్‌ అయితే కన్నీళ్లు వాటంతటవే వచ్చేస్తాయని అంటున్నారు నటి మెహరీన్‌. ప్రస్తుతం ఆమె కథానాయిక నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా..!’. కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మెహరీన్‌ విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివి..

సంక్రాంతికి నా సినిమా రావడం అదృష్టం:

నేను నటించిన సినిమాలు ప్రతి ఏడాది ఏదో ఒక ఫెస్టివల్‌కు విడుదలయ్యేవి. కాకపోతే నాకు మాత్రం సంక్రాంతి నేను నటించిన సినిమా ఒక్కటైనా విడుదలైతే బాగుండు అని అనుకునే దాన్ని. అలా ఈ ఏడాది నా కోరిక తీరింది. నేను నటించిన రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఒకటి తమిళంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన ‘పటాస్‌’. మరొకటి తెలుగులో కల్యాణ్‌ రామ్‌తో ‘ఎంతమంచి వాడువురా..!’.

అన్నీ ఎమోషన్స్‌ ఉన్న పాత్ర:

‘ఎంతమంచి వాడవురా’ సినిమాలో నా పాత్ర పేరు నందు. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌. ఆ అమ్మాయి చేసే సినిమాల్లోనే కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తుంటాడు. అలా ఫస్టాఫ్‌ అంతా మధ్య చాలా సరదాగా గడిచిపోతుంది. నేను నటించిన నందు పాత్ర నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నందు పాత్రలో ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు తప్పకుండా నందుతో కొత్త మెహరీన్‌ను చూస్తారు. ఇప్పటి వరకు నేను ఎమోషనల్‌ సన్నివేశాలకు గ్లిజరిన్‌ వాడలేదు, ఇకపై కూడా వాడను. 

గుజరాతీ మూవీకి రీమేక్‌..

‘ఎంత మంచివాడవురా..!’ గుజరాతీ సినిమాకు రీమేక్‌ అని దర్శకుడు చెప్పారు. నేను ఆ సినిమా చూడలేదు. కానీ ఈ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఇందులో ఎన్నో మార్పులు చేశారు. ఈ కథ నా ఒళ్లు గగుర్పొడించింది. నందు పాత్రకు నన్నే ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాను. ఆయనే ఒకటే చెప్పారు. ఈ పాత్రకు మీరు చక్కగా సెట్ అవుతారు. అందుకే మిమ్మల్ని ఈ పాత్ర కోసం తీసుకున్నామని.

సరిలేరు నీకెవ్వరు ఆఫర్‌..

‘సరిలేరు నీకెవ్వరు’ ఆఫర్‌ నాకు రాలేదు. నేను కూడా మహేశ్‌ సర్‌తో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నాను. భవిష్యత్తులో ఛాన్స్‌ వస్తే తప్పకుండా నటిస్తా.

ఎంతమంచివాడవురా టైటిల్‌

‘ఎంతమంచివాడవురా’ టైటిల్‌ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా మంచి వ్యక్తి. నాలో స్ఫూర్తిని నింపారు. మొదటిసారిని కలిసినప్పుడు నువ్వు నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమా చూశాను. నీ నటన చాలా బాగుంది. నందు పాత్ర అన్నీ ఎమోషన్స్‌ ఉన్న పాత్ర. కాబట్టి నీ బెస్ట్‌ ఇవ్వు అని చెప్పారు. ఈ సినిమాతో నాలోని నటిని బయటకు తీసుకువచ్చాను.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని