పొగిడితే నేలపై పడుకుంటారట!
close
Published : 12/03/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొగిడితే నేలపై పడుకుంటారట!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు కొందరు. ముఖ్యంగా సినిమా స్టార్‌లను తీసుకుంటే కాస్త స్టార్‌ హోదా రాగానే వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అయితే, కొందరు మాత్రం ఎంత పెద్ద స్టార్‌లు అయినా చాలా అణకువగా, ప్రశాంతతతో ఉంటారు. ఉదాహరణకు రజనీకాంత్‌ ఎంత సింపుల్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి కూడా అంతే. యువ కథానాయకులను ప్రోత్సహిస్తూ, వారి సినిమా ఫంక్షన్లకు హాజరై శుభాకాంక్షలు చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో చిరు చురుగ్గా పాల్గొంటున్నారు.

చిరంజీవి సినీ కెరీర్‌ను తీసుకుంటే, కృషి, పట్టుదలతో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు... మరెన్నో ప్రశంసలు... ఇంకెన్నో విమర్శలు. వీటన్నింటినీ ఎలా స్వీకరిస్తారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్‌. ‘‘ఎవరైనా నన్ను పొగిడితే సంబరపడిపోను. సినిమా వేడుకల్లో నన్ను బాగా పొగిడినప్పుడు ఇంటికి వెళ్లగానే నేల మీద పడుకుంటా. ఎందుకంటే గర్వం రాకూడదు కదా! సినిమాలు విజయం సాధించి, ఎవరైనా ప్రశంసల వర్షం కురిపించినప్పుడు అది నా ఒక్కడి గొప్పతనం మాత్రమే కాదు.. దీని వెనుక ఎంతో మంది కళాకారులు, శ్రామికుల కష్టం ఉందని భావిస్తాను. ఎవరైనా విమర్శించినా చిత్ర బృందం మొత్తం సమష్టిగా ఫెయిల్‌ అయ్యామనే నమ్ముతా. ఈ రెండు విషయాల్లో నేను నిజాయతీగా ఉంటాను కాబట్టే విజయాలు, పరాజయాలను ఒకేలా తీసుకుంటా’’ అని అంటారు చిరంజీవి. 

ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని