హైదరాబాద్‌ పోలీసులపై మహేశ్‌ పోస్ట్‌
close
Published : 09/04/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ పోలీసులపై మహేశ్‌ పోస్ట్‌

సెల్యూట్‌ అంటోన్న సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: దేశంలో కరోనా కల్లోలం అధికమౌతోన్న తరుణంలో దాని కట్టడికి నిర్విరామంగా పనిచేస్తోన్న పోలీసులను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు ట్విటర్‌లో ఓ ట్వీట్‌ పెట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం, మన కుటుంబాల సంక్షేమం కోసం పనిచేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘కొవిడ్‌-19పై మన దేశం చేస్తున్న యుద్ధంలో అహర్నిశలు కష్టపడుతోన్న తెలంగాణ పోలీసు యంత్రాంగానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సంక్షేమం కోసం నిర్విరామంగా వారు అందిస్తున్న సేవలు అసాధారణమైనవి. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రాణాలతోపాటు, మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. మనదేశం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ నిస్వార్థమైన అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నాను’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటించి మెప్పించారు. రష్మిక కథానాయిక. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత మహేశ్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. అయితే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని