చికెన్‌.. మటన్‌ అంటూ గుంపులుగా తిరిగారో..
close
Updated : 25/04/2020 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చికెన్‌.. మటన్‌ అంటూ గుంపులుగా తిరిగారో..

పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి: నాగార్జున 

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు నాగార్జున, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘శివమణి’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగార్జున శివమణి అనే పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు. అయితే తాజాగా శివమణి సినిమాలోని ఓ సన్నివేశానికి ప్రస్తుతం కరోనా పరిస్థితులకు సరిపడే డైలాగులతో స్ఫూప్‌ చేసి ఓ నెటిజన్‌ వీడియోను రూపొందించారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఉన్న సదరు వీడియోను నాగార్జున తన ట్విటర్‌ ఖాతా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘శివమణి’ సినిమా కనుక ఇప్పుడు తెరకెక్కినట్లు అయితే పూరీ జగన్నాథ్‌ డైలాగులు ఇలా ఉండేవి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి జగన్‌. ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా జీవించండి’ అని నాగార్జున పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నాగార్జున పెట్టిన ట్వీట్‌పై స్పందించిన పూరీ.. ‘వీడియో చాలా బాగుంది సర్‌. నేను కూడా ఆ మధుర జ్ఞాపకాలను మిస్‌ అవుతున్నాను’ అని పేర్కొన్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని