సమంతతో పరిచయం.. నా అదృష్టం..!
close
Published : 25/04/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంతతో పరిచయం.. నా అదృష్టం..!

తమన్నా

హైదరాబాద్‌: కెరీర్‌ పరంగా దక్షిణాదిలో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు సమంత, తమన్నా. అంతేకాదు వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఇప్పటికే పలుమార్లు సోషల్‌మీడియా వేదికగా వీరి మధ్య సంభాషణలు జరిగాయి. ఒకర్నొకరు ప్రశంసించుకుంటూ ట్వీట్లు చేసుకున్నారు. సామ్‌ ఏప్రిల్‌ 28న తన 33వ పుట్టినరోజు వేడుకను జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమె కామన్‌ డీపీని రూపొందించారు. దీన్ని మిల్కీబ్యూటీ శనివారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

‘ఈ ప్రత్యేక సందర్భంలో సమంత బర్త్‌డే కామన్‌ డీపీని విడుదల చేస్తున్నా. ఆమె తన కెరీర్‌ను మలుచుకుని ముందుకు వెళ్తున్న తీరు ఆదర్శం. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. సూపర్‌ స్టైలిష్‌.. ఎంతో ఏకాగ్రత, నైపుణ్యం ఉన్న నటి. ఆమెతో నాకు పరిచయం ఉండటం నా అదృష్టం’ అని తమన్నా ట్వీ‌ట్‌ చేశారు. దీన్ని చూసిన సమంత స్పందించారు. ‘ధన్యవాదాలు.. నువ్వు నా డార్లింగ్‌వి. నా గురించి దయతో మాట్లాడావు. లవ్యూ బేబీ’ అని రిప్లై ఇచ్చారు.

సమంత ఇటీవల ‘జాను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ హిట్‌ ‘96’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్‌ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సామ్ త్వరలో ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2లో కనిపించనున్నారు. అదేవిధంగా తమిళంలో రెండు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. ‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని