‘కాజల్‌ అడ్వాన్స్‌ కూడా తీసుకుంది..!’
close
Published : 03/05/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కాజల్‌ అడ్వాన్స్‌ కూడా తీసుకుంది..!’

చిరు చిత్రంపై వదంతులు

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాపై కొత్త వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకొన్న తర్వాత కాజల్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగారని గత రెండు రోజులుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. తమిళ సినిమాకు ఎక్కువ డేట్స్‌ కావాల్సి రావడంతో కాజల్‌ ‘ఆచార్య’ను వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారంపై కాజల్‌ ప్రతినిధులు‌ స్పష్టత ఇచ్చారు. నటి సినిమా నుంచి తప్పుకోలేదని పేర్కొన్నారు. ‘కాజల్‌ సినిమాకు ఎప్పుడో సంతకం చేశారు. అంతేకాదు చిరు సినిమాకు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత షూటింగ్‌ను పునః ప్రారంభిస్తే.. ఆమె నేరుగా సెట్‌కు వెళ్తారు’ అని తేల్చి చెప్పారు.

చిరు-కాజల్‌ ఇప్పటికే ‘ఖైదీ నెంబరు 150’ సినిమా కోసం పనిచేశారు. ‘ఆచార్య’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత చిరు ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించబోతున్నారు. సుజీత్ దర్శకుడు. అదేవిధంగా దర్శకుడు బాబీ, మెహర్‌ రమేశ్‌, సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, పరశురాంతో పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారని ఇటీవల చిరు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని