రూ.200 చెల్లిస్తే.. మీతో డ్యాన్స్ చేస్తా‌: శ్రియ
close
Published : 05/05/2020 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.200 చెల్లిస్తే.. మీతో డ్యాన్స్ చేస్తా‌: శ్రియ

మంచి పనికి నటి శ్రీకారం

హైదరాబాద్‌: రూ.200 చెల్లిస్తే తనతో కలిసి డ్యాన్స్‌ (వీడియో కాల్‌లో) చేసే అవకాశం లభిస్తుందని కథానాయిక శ్రియ పేర్కొన్నారు. ఆమె స్పెయిన్‌లో తన భర్త ఆండ్రీతో కలిసి నివసిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఆమె ఓ మంచి పని కోసం విరాళాలు సేకరించేందుకు నడుంబిగించారు. లాక్‌డౌన్‌ వల్ల సమస్యలు ఎదుర్కొంటోన్న పేదవారి కష్టాలు తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.

‘కొవిడ్‌ బాధితుల కోసం విరాళాల సేకరణకు ‘ది కైడ్‌నెస్‌ ఫౌండేషన్‌, చెన్నై టాస్క్‌ ఫోర్స్‌ బృందాలతో కలిసి పనిచేస్తున్నా. నిరాశ్రయులైన వృద్ధులు, రోజువారీ కూలీలు, అనాథలు, వికలాంగుల శ్రేయస్సుకు ఈ విరాళాలు వినియోగించబోతున్నాం. ఇద్దరు అదృష్ట విజేతలను ఎంపిక చేస్తాం. వాళ్లు నాతో కలిసి నృత్యం చేయొచ్చు. కాసేపు యోగా కూడా చేయొచ్చు. ఈ క్వారంటైన్‌ను మరింత ప్రకాశవంతంగా మార్చుదాం. www.thekindnessproject.inలో రూ.200 విరాళం చెల్లించి, మీ రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయండి. శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాల్ని వెబ్‌సైట్‌లో ఉంచుతాం. మనమంతా ఓ మంచి పని కోసం చేతులు కలుపుదాం’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని