ఆ సమాచారాన్ని నాకు పంపండి
close
Published : 14/05/2020 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సమాచారాన్ని నాకు పంపండి

మనసులోని మాటను నెటిజన్లతో పంచుకున్న మంచువిష్ణు

హైదరాబాద్‌: ‘తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర సైనికులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీ దగ్గరుంటే అవి నా సోషల్‌మీడియా అకౌంట్లకు పంపించండి’ అని కోరారు నటుడు మంచువిష్ణు. లాక్‌డౌన్‌ సమయంలో తనలోని నైపుణ్యాలకు పదునుపెడుతున్న విష్ణు తాజాగా తన ట్విటర్‌ ఖాతా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేశారు. మాతృమూర్తితోపాటు రైతు, జవాన్లకు ప్రతిఒక్కరూ తప్పకుండా శిరస్సు వంచి నమస్కరించాలని ఆయన సూచించారు. ఇప్పటివరకూ వీర జవాన్లను కలుసుకోలేదని, కానీ ఇప్పుడు భారత వీర జవాన్లను గురించి తెలుసుకునే కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నానని ఆయన వివరించారు.

‘అందరికీ నమస్కారం. ఈ రోజు నా మనసులోని మాటను మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో నిత్యం మనం శిరస్సు వంచి నమస్కరించాల్సిన వారు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలాకాసే వీరజవాన్‌. ఈ ముగ్గురికీ లభించాల్సిన గుర్తింపు దక్కడం లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శవంతమైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతన్నలను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవాన్లను కలిసే అదృష్టం నాకు ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత జవాన్ల గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. ప్రపంచంలో ఎంతో సమర్థవంతమైన భారత ఆర్మీలో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వింపజేస్తున్న ప్రతిఒక్కరికీ నమస్కరిస్తూ ఆర్మీలో తమ ముద్ర వేసిన తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా తెలుగు వీర సైనికులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఉంటే వాళ్ల పేర్లతో సహా నా సోషల్‌మీడియా అకౌంట్లకి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వారి వీర కథలను పంచుకుందాం. జై జవాన్‌, జై కిసాన్‌, జై హింద్‌’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని