ఎన్టీఆర్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ నేనిస్తా!
close
Published : 19/05/2020 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. సర్‌ప్రైజ్‌ నేనిస్తా!

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: కథానాయకుడు ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మే 20న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయడానికి వీలులేకపోవడంతో టీజర్‌ రూపొందించడం కష్టంగా మారింది. దీనిపై తారక్‌ వివరణ కూడా ఇచ్చారు. యూనిట్‌ సభ్యులు చాలా కష్టపడ్డారని, కుదరలేదని చెప్పారు. పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అందరూ భౌతికదూరం పాటించాలని కోరారు. దీంతో నిరాశ చెందిన అభిమానుల్లో.. తారక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ కాస్త ఉత్సాహం నింపారు. ‘బుధవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానుల కోసం నా వద్ద ప్రత్యేకమైంది ఉంది. నా ట్విటర్‌లో దాన్ని మీతో షేర్‌ చేసుకోబోతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్స్‌ నుంచి..

‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1కు వ్యాఖ్యాతగా వ్యవహరించి తారక్‌ బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన జన్మదినం సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 హౌస్‌మేట్స్‌ అంతా కలిసి ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. దీన్ని రేపు ఉదయం 9.30 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేయబోతున్నారు. మరోపక్క యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ కూడా తారక్‌కు అంకితం ఇస్తూ ఓ పాటను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు దీన్ని షేర్‌ చేయబోతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని