దిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌..!
close
Updated : 09/03/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌..!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు వేస్తున్న ఓ జంటను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏ(పౌరసత్వం సవరణ చట్టం) నిరసన పేరుతో ఈ దాడులు చేసేందుకు ప్లాన్‌ చేశారని అధికారులు తెలిపారు. కశ్మీర్‌కు చెందిన జహన్‌జేబ్‌ షమీ, హినా బషీర్‌బేగ్‌ భార్యభర్తలు. వీరు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఖోరాసన్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌  యూనిట్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో దాడులకు పాల్పడేందుకు ఐసిస్‌కు చెందిన సీనియర్‌ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జామియానగర్‌లోని జామియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి సమీపంలోని వాళ్ల ఇంట్లోనే ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

జహన్‌న్‌జేబ్‌ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ‘ఇండియన్‌ ముస్లిం యునైట్‌’ పేరుతో ఒక సోషల్‌ మీడియా పేజీని కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. కాగా.. సీఏఏకు వ్యతిరేకంగా ఈ దిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని