పాలన చూస్తుంటేరక్తం ఉడికిపోతోంది:చంద్రబాబు
close
Published : 11/01/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాలన చూస్తుంటేరక్తం ఉడికిపోతోంది:చంద్రబాబు

రాజమహేంద్రవరం: రాజధాని అంటే పేకాటలో మూడు ముక్కలాట అనుకున్నారా? అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  రాజధాని ఎవరైనా గర్వంగా చెబుతారని.. మరి మనమేం చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమరావతిని మార్చాలని రాష్ట్రంలో ఒక్కరైనా అడిగారా?3 రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా?’’ అని ఆయన ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ప్రజలంతా కోరుకున్నారన్నారు. ఉపాధి కావాలని రాష్ట్ర యువత కోరుకుంటోందని చెప్పారు. జీవితంలో తొలిసారిగా అమరావతి కోసం జోలె పట్టానన్నారు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా ప్రజలు విరాళాలు ఇచ్చారు. తన కోసం పోరాడటం లేదని.. ప్రజల కోసమే పోరాడుతున్నానని చెప్పారు. విశాఖ, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం.. ఇలా అన్ని నగరాలు అభివృద్ధి కావాలన్నారు. వైకాపా పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

మీకు అక్కడి భూములపైనే ప్రేమ!

‘‘రైతుల పొట్ట కొట్టాలని విశాఖ వాసులు కోరుకోరని చంద్రబాబు అన్నారు. హుద్‌హుద్‌ తుపాను వచ్చినపుడు అక్కడే ఉండి ఎంతో పనిచేశామని గుర్తు చేశారు. నగరంలో ప్రజల కనీస అవసరాలను సాధారణ స్థాయి తీసుకొచ్చేవరకు అక్కడే ఉండి పర్యవేక్షించామన్నారు. విశాఖకు డేటా సెంటర్‌, లులు సంస్థను తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ‘‘విశాఖ జిల్లాపై మీకు ప్రేమ లేదు.. అక్కడి భూములపైనే ప్రేమ. విశాఖపై ప్రేమ ఉంటే ఇప్పటికే అనేక సంస్థలు తెచ్చేందుకు కృషి చేసేవారు. ఏ-2 విశాఖలోనే 7 నెలలుగా ఉండి భూములపై కన్నేశారు’’ అని పరోక్షంగా వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డిని ఉద్దేశించి దుయ్యబట్టారు.

మాటిచ్చాం.. అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే

అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ అని ఆరోపిస్తున్నారని.. రైతుల భూముల ధరలు పెరిగితే మీకొచ్చిన ఇబ్బందేంటని వైకాపా నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘రూ.కోటి విలువైన భూమిని రూ.10లక్షలు చేసిన పెద్దమనిషి ఈ జగన్‌. నేను ప్రజల నుంచి ఏమీ ఆశించడం లేదు. అమరావతి రైతులకు మాటిచ్చాం.. అండగా నిలబడాల్సిన బాధ్యత మనదే. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని మనమంతా కాపాడుకోవాలి. రాజధాని అమరావతి ఇటుకలు అని పిలుపిస్తే రూ.57కోట్లు ఇచ్చారు. అమరావతి పరిరక్షణ సమితికి మహిళలు తమ నగలు కూడా ఇచ్చారు’’ అని చెప్పారు.

నేనొక్కడినే ఎదుర్కోగలను.. జాగ్రత్త!

అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు. వైకాపాకు చెందిన 151 మంది ఎమ్మెల్యేలనూ తానొక్కడినే ఎదుర్కోగలనని.. జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులకు వినపడేవరకు జై అమరావతి నినాదాలు చేయాలని.. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని మనం కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని