రాష్ట్రంలో పవన్‌తో కలిసి పనిచేస్తాం: లక్ష్మణ్‌
close
Updated : 27/01/2020 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రంలో పవన్‌తో కలిసి పనిచేస్తాం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఇప్పటికే పవన్‌తో ఫోన్‌లో మాట్లాడామని, త్వరలో భేటీ అవుతామని చెప్పారు. దేశంలో భాజపాతో కలిసి పనిచేసేందుకు పవన్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో పవన్‌ సేవలు తీసుకుంటామని చెప్పారు. జనసేన-భాజపా కలిసి పనిచేసి రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలనను దించుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస అనైతిక చర్యకు పాల్పడిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. మెజారిటీ లేని స్థానాల్లో కూడా తెరాస దొడ్డిదారిన ఛైర్మన్‌ పదవి చేజిక్కించుకుందని విమర్శించారు. భాజపా గెలిచిన తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజా తీర్పును తెరాస వమ్ము చేసిందని మండిపడ్డారు. 100 సీట్లు గెలిచినా తెరాసకు తృప్తి లేదని వ్యాఖ్యానించారు. భాజపా గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు. తుక్కుగూడ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని