చివరికి బలైపోయేది అధికారులే..:పవన్‌
close
Published : 04/02/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చివరికి బలైపోయేది అధికారులే..:పవన్‌

అమరావతి: అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయాలను తరలిస్తూ జీవో నంబర్‌ 13ను అర్ధరాత్రి వేళ జారీ చేయడం నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయడానికా అని ప్రశ్నించారు. ఇటువంటి చర్యల వల్ల చివరికి బలైపోయేది దానిపై సంతకాలు చేసే ఉద్యోగులేనని చెప్పారు. అయినా రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పనిచేయాల్సిన రాష్ట్ర విజిలెన్స్‌ ‌కమిషనర్‌ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం ఆ విషయం అందులో పనిచేసేవారికీ అర్థం కాకుండా ఉందని విమర్శించారు. ఇలా తరలించడం వల్ల తాము కోర్టు కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామోనని భయపడుతూ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారి సెలవు పెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోందని, దీని బట్టి వారు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం దొడ్డి దారి జీవోలు ఆపాలని హితవు పలికారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని