ఆ వివరాలివ్వండి.. హోంశాఖకు ఇస్తా: పవన్‌
close
Published : 17/03/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వివరాలివ్వండి.. హోంశాఖకు ఇస్తా: పవన్‌

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ దశలో చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్‌ ఇచ్చినా.. బలవంతంగా ఉపసంహరింపజేయడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగం పనిచేయడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో చోటుచేసుకున్న దౌర్జన్యాలపై ఎంత మాత్రం మౌనంగా ఉండకూడదని పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోంశాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, ఇన్‌ఛార్జులతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలపై మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పెట్రేగిపోతారని పవన్‌ అన్నారు. ‘‘మీ పరిధిలో నామినేషన్‌ వేసేందుకు ఎదురైన ఇబ్బందులు, ఎదుర్కొన్న దాడులను వివరంగా చెప్పండి. మన పార్టీ అభ్యర్థులపై దాడి జరిగిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. భాజపా అభ్యర్థులపై కూడా దాడి జరిగింది. పార్టీ అభ్యర్థులు, నాయకులపై దాడులు జరుగుతుంటే రక్షించాల్సిన పోలీసుల వివరాలతోపాటు నామినేషన్లు అడ్డుకున్న అధికారుల వివరాలు కూడా ఇవ్వండి. అన్నింటినీ క్రోడీకరించి హోంశాఖకు అందజేస్తా. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తా’’ అని పవన్‌ చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని