హైవే పైకి విమానం.. చిత్రాలు వైరల్‌!
close
Published : 28/01/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైవే పైకి విమానం.. చిత్రాలు వైరల్‌!

టెహ్రాన్‌: ఇరాన్‌లోని కుజెస్థాన్‌ ప్రావిన్స్‌లో సోమవారం ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన విమానం రన్‌వే పై నుంచి జాతీయ రహదారిపైకి దూసుకువచ్చింది. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. కాస్పియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం 135 మంది ప్రయాణికులతో టెహ్రాన్‌ నుంచి మహ్‌షహర్‌ విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ క్రమంలో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో విమానం పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదు.. కానీ ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌ దగ్గర ఉన్న తలుపు తెరుచుకుని సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ఘటన జరగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా విమానం జాతీయ రహదారిపైకి దూసుకు వచ్చిన చిత్రాలు అందరినీ ఆకర్షిస్తుండటంతో ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టెహ్రాన్‌కు చెందిన కాస్పియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి 2009లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని ఖజ్వి ప్రాంతంలో విమానం కూలిపోయిన ఘటనలో 153 మంది ప్రయాణికులు మరణించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని