కరోనా మళ్లీ రాదనేందుకు ఆధారాలు లేవు
close
Published : 25/04/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మళ్లీ రాదనేందుకు ఆధారాలు లేవు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)

జెనీవా: కరోనా నుంచి కోలుకున్నవారికి మరోసారి మహమ్మారి ముప్పు లేదనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శనివారం తెలిపింది.  కరోనా నుంచి బయటపడ్డవారికి కొన్నిచోట్ల ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్‌లు, రిస్క్‌ ఫ్రీ సర్టిఫికెట్స్‌ ఇవ్వడంపై ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్ణయాలతో వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంది.  కరోనా నుంచి కోలుకున్నవారికి హెల్త్‌ పాస్‌పోర్టులు ఇవ్వనున్నట్లు కొన్ని దేశాలు గత వారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ చేసిన ప్రకటన కీలకంగా మారింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని