తెలంగాణలో కరోనా@ ఈ రోజు 1080కి పైనే..
close
Updated : 27/06/2020 22:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కరోనా@ ఈ రోజు 1080కి పైనే..

రాష్ట్ర వ్యాప్తంగా 13వేలు దాటాయ్‌..

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతున్నాయి. ఈ రోజు మరో 1087 కేసులు నమోదు కావడం తీవ్ర కలవరపెడుతోంది. శనివారం మొత్తం 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వాటిలో 1087 పాజిటివ్‌గా తేలగా.. 2836 నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,436కి పెరిగింది. 

మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243కి పెరిగింది. రాష్ట్రంలో ఈ రోజు మరో 162 మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా డిశ్చార్జిఅయిన వారి సంఖ్య 4928కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

హైదరాబాద్‌లో 888 కేసులు
మరోవైపు, ఈ రోజు వచ్చిన మొత్తం కేసుల్లో 888 పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35 చొప్పున అత్యధిక కేసులు ఈ రోజకు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని