నా నెంబర్‌కూ ఫిర్యాదు చేయొచ్చు: ఆళ్ల నాని
close
Published : 11/07/2020 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా నెంబర్‌కూ ఫిర్యాదు చేయొచ్చు: ఆళ్ల నాని

ఏలూరు: కరోనా ఆస్పత్రుల్లో తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఏలూరు కలెక్టర్‌ ఆఫీసు నుంచి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో మాధ్యమం ద్వారానే కొవిడ్‌ ఆస్ప్రతుల్లోని రోగులతో మాట్లాడారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో భోజనం నాణ్యత సరిగా లేదని, దుప్పట్లు ఇవ్వట్లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని ఈ సందర్భంగా మంత్రికి రోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా 1800 233 1077 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తన ఫోన్‌ నెంబర్‌కూ ఫిర్యాదు చేయవచ్చని రోగులకు మంత్రి భరోసా ఇచ్చారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని