పాక్ జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది
close
Published : 07/02/2020 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్ జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది

మలాలాపై కాల్పులు, పెషావర్‌ పాఠశాల దాడుల్లో హస్తం

ఇస్లామాబాద్‌: నోబెల్‌ గ్రహీత మలాలాపై కాల్పులు, పెషావర్‌ ఆర్మీ పాఠశాలపై దాడి వంటి సంఘటనలకు బాధ్యుడైన కరడుగట్టిన ఉగ్రవాది ఒకరు పాక్‌ జైలు నుంచి తప్పించుకున్నారు. తాను జైలు నుంచి తప్పించుకున్నట్టు స్వయంగా ప్రకటిస్తూ మాజీ తాలిబన్‌ ప్రతినిధి ఇషానుల్లా ఎహ్సాన్‌ గురువారం ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశాడు. సోషల్‌ మీడియాలో విడుదలైన ఈ ఆడియో క్లిప్‌లో పాకిస్థాన్‌ భద్రతా దళాల నిర్బంధం నుంచి తాను జనవరి 11న తప్పించుకున్నానని అతను పేర్కొన్నాడు.  2017లో తాను లొంగిపోయినప్పుడు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో పాక్‌ బలగాలు విఫలమయ్యాయని ఇషానుల్లా ఆరోపించాడు. 

2012లో మలాలా యూసఫ్‌ జాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు ఇషానుల్లా బాధ్యుడు. అంతేకాకుండా  2014లో పెషావర్‌ ఆర్మీ పాఠశాలపై జరిగిన దాడిలో కూడా అతడి హస్తం ఉంది. భద్రతా దళాల వేషంలో ఉగ్రవాదులు పాఠశాల ఆవరణలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఈ ఘటనలో 132 విద్యార్థులతో సహా మొత్తం 149 మంది మృతిచెందారు. 

కాగా తన నిర్బంధాన్ని గురించి, భవిష్యత్‌ ప్రణాళికను గురించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఇషానుల్లా చెప్పాడు. అయితే ఈ ఆడిమో క్లిప్‌ ఆ ఉగ్రవాదిదేనా అనే విషయాన్ని పాక్‌ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని