చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
close
Published : 06/04/2020 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

లక్షణాలు కనిపించకుండానే వ్యాపిస్తోన్న వైరస్‌

బీజింగ్‌: చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో నమోదవుతున్న కేసులు భారీస్థాయిలో తగ్గడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షలను సడలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడిచేయడంలో చైనా తీసుకున్న చర్యలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇదిలాఉంటే, తాజాగా చైనాలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యాధి నిర్ధారణ అవుతున్నప్పటికీ లక్షణాలు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

గతవారం నుంచి చైనాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైందని అక్కడి అధికారులు ప్రకటిస్తున్నారు. దేశవ్యాప్తంగా శనివారం 30కరోనా కేసులు నమోదుకాగా ఆదివారం మరో 39 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అయితే వీరిలో కరోనా లక్షణాలు బయటపడని కేసులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా లక్షణాలు కనపడని మరో 78 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. నిర్ధారణ అవుతున్న కేసుల్లో విదేశీ ప్రయాణంతో పాటు లక్షణాలు కనిపించని వారి నుంచే సోకుతున్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్‌ మొట్ట మొదటికేసు బయటపడిందని భావిస్తున్న హుబే ప్రావిన్సు నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్‌ వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా వైరస్‌ లక్షణాలు కనిపించని 705మందిని ప్రత్యేక పరీక్షలో ఉంచినట్లు తెలిపారు. తాజాగా వుహాన్‌ నుంచి ఇతర పట్టణాలకు ప్రయాణాన్ని అనుమతించడంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. దీంతో హుబే సమీప జిల్లాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

చైనాలో మొత్తం 81,708 కరోనా కేసులు నమోదుకాగా 3330 మరణించినట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో భారీ సంఖ్యలో నమోదైన మరణాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య మార్చి చివరినాటికి భారీగా తగ్గింది. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 90 శాతం మంది కోలుకున్నట్లు అక్కడి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే చైనా పేర్కొంటున్న కరోనా కేసులు, మరణాల సంఖ్యపై ప్రపంచవ్యాపంగా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని