మనం నిద్రపోతే.. వైరస్‌ నిద్రపోతుందట!
close
Published : 15/06/2020 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనం నిద్రపోతే.. వైరస్‌ నిద్రపోతుందట!

ఇస్లామాబాద్‌ : కరోనాను ఎలా తుదముట్టించాలని శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తోంటే.. పాకిస్థాన్‌కు చెందిన ఓ రాజకీయ నేత సరికొత్త పద్దతి కనిపెట్టారు. అదేంటంటే.. మనం నిద్ర పోతే వైరస్‌ కూడా నిద్రపోతుందట! వినడానికే నవ్వు తెప్పిస్తున్న ఈ మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘డాక్టర్లు మనల్ని ఎక్కువగా నిద్రపొమ్మని చెబుతుంటారు. మనం ఎక్కువగా నిద్రపోతే వైరస్‌ కూడా ఎక్కువగా నిద్రపోతుంది. అది మనకు హాని చేయదు. మనం నిద్రపోతే అది నిద్రపోతుంది. మనం చనిపోతే అప్పుడు అది కూడా చనిపోతుందని’ ఫజల్‌ ఉర్‌ రెహమాన్‌ అనే పాక్‌ రాజకీయ నేత పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఆయన ఎప్పుడు మాట్లాడారో సరిగ్గా తెలియలేదు కానీ నెట్టింట్లో మాత్రం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్పింగ్‌ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ‘ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఇతడు ముందే ఎందుకు చెప్పలేదని’ ఓ వ్యక్తి ట్విటర్‌లో వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘అయితే ప్రాథమికంగా వైరస్‌ మనల్ని కాపీ కొడుతుందన్న మాట. ఇది చైనా వైరస్‌ కాబట్టి కాపీయే కొడుతుంది. ఇంత అద్భుతమైన సిద్ధాంతం విన్న తరువాత అక్కడున్న వారెవరూ ఆత్మహత్య చేసుకోకూడదని భావిస్తున్నా’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు.

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని