Corona: 2లక్షల దిగువకు కేసులు
close
Updated : 26/05/2021 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 2లక్షల దిగువకు కేసులు

వరుసగా 12వ రోజూ తగ్గుదల
24 గంటల్లో 3,511 మంది మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో వరుసగా 12వ రోజు కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. 40 రోజుల తర్వాత.. మంగళవారం తొలిసారి 2 లక్షల లోపు కేసులు నమోదయ్యాయి. రోజువారీ మరణాల సంఖ్య కూడా తగ్గడం కొంతలో కొంత ఊరట. గత 24 గంటల్లో 1,96,427 కొత్త కేసులు నమోదు కాగా.. 3,511 మంది మృతి చెందారు. ఇంత తక్కువగా రోజువారీ కేసులు నమోదు కావడం ఏప్రిల్‌ 14 తర్వాత ఇదే తొలిసారి. మరణాలు క్రితం రోజు కంటే 21%మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరింది. మహమ్మారి బారిన పడి, ఇంతవరకు మొత్తం 3,07,231 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.14%గా ఉంది.
* దేశ వ్యాప్తంగా ఒక్కరోజులో 3,26,850 మంది కోలుకున్నారు. దీంతో క్రియాశీలక కేసుల్లో 1,33,934 తగ్గుదల నమోదైంది. ఇంత భారీసంఖ్యలో తగ్గడం 18వ తేదీ తర్వాత ఇదే తొలిసారి. మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 25,86,782కి తగ్గింది. ఇంతవరకు 2,40,54,861 మంది మహమ్మారిని జయించారు.
* దేశంలో ఈనెల 24 వరకు దాదాపు 33.26 కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. సోమవారం నాడు 20,58,112 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. పాజిటివిటీ రేటు 9.54%కి తగ్గింది.  
* దేశంలో 7 రాష్ట్రాల్లో.. ఒక్కోచోట 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని