శంఖుపుష్పిస్తే...
close
Published : 15/03/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంఖుపుష్పిస్తే...

ఆకర్షణీయమైన పూలను ఇవ్వడంతో పాటు ఇంటి అందాన్ని రెట్టింపుచేసే మొక్క శంఖుపుష్పి. శంఖం ఆకారంలో ఉండటంతో వీటికి ఆ పేరొచ్చింది.
ఒక్కసారి నాటితే సంవత్సరాల తరబడి పూలు పూసే మొక్క ఇది. ఎక్కువగా చీడపీడలు సోకవు. తెలుపు, నీలి రంగు పూలతో ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి వేసవిలో బాగా పూస్తుంది. నీళ్లు ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువ వేడినీ తట్టుకుంటుంది. అన్ని మట్టి నేలల్లోనూ పెరుగుతుంది.
అంతా ఔషధమయం..
ఈ మొక్క వేర్లు, ఆకులు, పూల నుంచి ఔషధాలు తయారుచేసుకోవచ్చు. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, కుంగుబాటును తగ్గిస్తాయి. గుండె పనితీరును పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీర సౌందర్యాన్ని పెంచడంతోపాటు తలనొప్పి తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పొడి, కషాయం, నూనె, ద్రవ రూపంలో దీన్ని వాడుకోవచ్చు. దీంతో చేసే టీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.

- సూరం సింధూజ, ఉద్యాన నిపుణులు


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని