కత్తెర పట్టిన  అనుష్క!
close
Updated : 29/03/2020 06:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కత్తెర పట్టిన  అనుష్క!

కాస్త సమయం చిక్కినా విహార యాత్రలకు ఎగిరిపోయే జంట పక్షులు... విరాట్‌, అనుష్క. ఆర్భాటాలకు దూరంగా హాయిగా, ఆనందంగా ఎలా ఉండాలో వీళ్లను చూసి నేర్చుకోవచ్ఛు ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఎంతగానో ఆస్వాదించే ఈ ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవన్నీ కొత్తగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... కరోనా నివారణ చర్యల్లో భాగంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అలా ఇంటికే పరిమితమైన ఈ జంట... దొరికిన ఈ సమయాన్నీ హాయిగా ఆస్వాదిస్తున్నారు. అనుష్క ఇంట్లోనే విరాట్‌కు చక్కగా క్రాఫ్‌ చేసేసింది. అందుకోసం ప్రత్యేక పరికరాలేవీ అందుబాటులో లేకపోయినా.. ఇంట్లో ఉండే కత్తెరలనే ఉపయోగించింది. జుట్టు కత్తిరిస్తోన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే అయిదులక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. భార్య చేసిన కటింగ్‌ చూసి విరాట్‌ ఎంతో మురిసిపోవడం కొసమెరుపు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని