ఆరోగ్య యోగం
close
Published : 03/05/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య యోగం

గంటలకు గంటలు టీవీల ముందు కూర్చున్నా... రోజంతా సెల్‌ఫోన్లతో గడిపినా మనసులో ఏదో తెలియని ఆందోళన, దిగులు. చాలామందిది ఇదే పరిస్థితి. దీని నుంచి బయటపడటానికి ఈ ముద్రలు, ఆసనాలు వేసి చూడండి...


భ్రమరీ ప్రాణాయామం

వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి. రెండు చేతుల బొటనవేళ్లు చెవుల మీద పెట్టాలి. చెవులను మూయాలి. మిగతా వేళ్లను దూరంగా ఉంచాలి. కళ్లు మూసుకుని శ్వాస తీసుకుని ఉమ్‌... అని శబ్దం చేయాలి. మళ్లీ శ్వాస తీసుకుని మళ్లీ శబ్దం చేయాలి. ఇలా పదిహేను నుంచి ఇరవైసార్లు చేయాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.


ఆనందమదిరాసనం

జ్రాసనంలో రెండు కాళ్లు వెనక్కి మడిచి కూర్చోవాలి. రెండు అరచేతులు, రెండు అరకాళ్లకు ఆనించి ఉంచాలి. పిరుదులను కొద్దిగా పైకి లేపి రెండు అరచేతులను రెండు పాదాల మీద ఉంచి, వెన్నెముక నిటారుగా పెట్టాలి. కళ్లు మూసుకుని మూడు నిమిషాలు ఈ ఆసనంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

- అరుణ
యోగా నిపుణులు


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని